ETV Bharat / state

Viveka Murder Case: "నాకు ఇచ్చిన గన్‌మెన్లు నాతో ఉండట్లేదు" - దస్తగిరి లేటెస్ట్ న్యూస్

పోలీసులు నాకు రక్షణ కల్పించట్లేదు
పోలీసులు నాకు రక్షణ కల్పించట్లేదు
author img

By

Published : Apr 23, 2022, 2:40 PM IST

Updated : Apr 24, 2022, 5:47 AM IST

14:36 April 23

పోలీసులు నాకు రక్షణ కల్పించట్లేదు: దస్తగిరి

భద్రత కంటే తన కదలికల పైనే పోలీసు సిబ్బంది ఎక్కువ దృష్టి సారించారని మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల నుంచి తనకు తగినంత రక్షణ కల్పించాలని వేడుకున్నారు. శనివారం పులివెందులలో దస్తగిరి విలేకర్లతో మాట్లాడారు. కోర్టు ఈ నెల 20నే ఉత్తర్వులిచ్చినా, ఇంకా పోలీసుశాఖ ఎలాంటి భద్రత కల్పించలేదన్నారు. భద్రత సిబ్బంది నియామకంపై ఎస్పీ అన్బురాజన్‌ను కోర్టు అడగగా.. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నట్లు కోర్టుకు బదులిచ్చారని చెప్పారు. భద్రతా సిబ్బందిని నియమించలేదనే విషయాన్ని తాజాగా సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌కు చెప్పగా, కోర్టు ఉత్తర్వుల పత్రాన్ని తనకు పంపిస్తానని తెలిపారన్నారు. కడపలో ఎస్పీ అన్బురాజన్‌ను ఆదివారం కలిసి వినతిపత్రం సమర్పిస్తానని చెప్పారు. జీవనోపాధి కోసం తొండూరు మండలం మల్లేల గ్రామ పరిసరాల్లో అద్దెకు ట్రాక్టర్‌ను తిప్పుతున్నానని, రెండు రోజులకోసారి అందుకోసం వెళ్లాల్సి ఉందన్నారు. అయిదు నెలల కిందట నియమించిన 1+1 పోలీసు సిబ్బంది ఇంటి వరకే కాపలా ఉంటున్నారని, బయటకు వెళుతున్నప్పుడు తన వెంట రారని పేర్కొన్నారు.

పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశాం: డీఎస్పీ

దస్తగిరి ఇంటి సమీపంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశామని, బయటికి వెళ్లేటప్పుడు ఒక కానిస్టేబుల్‌ను పంపుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసు రక్షణ కల్పించలేదని దస్తగిరి చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

"కోర్టుకు నివేదించినట్లుగా పోలీసులు నాకు రక్షణ కల్పించట్లేదు. పులివెందుల దాటి వెళ్తే నా వెంట సెక్యూరిటీ రావట్లేదు. నాకు ఇచ్చిన గన్‌మెన్లు నాతో ఉండట్లేదు. ప్రతిసారీ సీబీఐ అధికారులకు ఫోన్ చేస్తున్నా. ఫోన్‌ చేసి సెక్యూరిటీ పంపాలని కోరడం ఇబ్బందిగా ఉంది. నాకు ప్రాణాహాని జరిగితే మళ్లీ నా ప్రాణాలు తెస్తారా? నా కదలికలు తెలుసుకుంటున్నారు తప్ప నాకు రక్షణగా ఉన్నట్లు లేదు."- దస్తగిరి, వివేకా హత్య కేసు నిందితుడు

మళ్లీ మెుదలైన విచారణ: వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ మళ్లీ మొదలైంది. రెండు నెలల తర్వాత సీబీఐ అధికారులు మరోసారి విచారణ చేపట్టారు. నిన్న(శుక్రవారం) కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అనుమానితులను ప్రశ్నించారు. పులివెందులకు చెందిన వైకాపా కార్యకర్త కిరణ్ కుమార్ యాదవ్​ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా కేసులో సీబీఐ అరెస్ట్ చేసిన సునీల్ యాదవ్ సోదరుడే కిరణ్ కుమార్ యాదవ్.

గతంలో సునీల్ యాదవ్, కిరణ్ కుమార్ యాదవ్, తల్లిదండ్రులను కూడా సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. ప్రస్తుతం సునీల్ యాదవ్ కడప జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అతని సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ ను మరోసారి దాదాపు రెండు గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. న్యాయవాది సమక్షంలో కిరణ్​ను విచారించినట్లు సమాచారం. వివేకా హత్య కేసుకు సంబంధించి పలు అంశాలపై కిరణ్ కుమార్ యాదవ్​ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: Viveka Murder Case:దస్తగిరి, రంగన్నకు భద్రత కల్పించేందుకు సీబీఐ చర్యలు

Last Updated : Apr 24, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.