కడప జిల్లా కమలాపురం మండలం పొడడుత్తి సర్పంచ్‌గా తనను గెలిపించిన గ్రామ పంచాయతీ ప్రజలకు పాలేటి ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ పరిధిలోని యర్రబల్లి, కొత్తపల్లి గ్రామాల్లో కార్యకర్తలు ఏర్పాటు చేసిన విజయోత్సవ ర్యాలీలో ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
అనంతరం కమలాపురం మండల నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పుత్తా నరసింహారెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: