కడప జిల్లా రాజంపేటలో కొలువైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు కమనీయంగా జరిగాయి. మహిళలు పాల కళశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. పిల్లలు అమ్మవారి వేషధారణతో ఆకట్టుకున్నారు. గర్భగుడిలోని అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పట్టువస్త్రాలు, పరిమళభరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో అలంకరించారు. అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వెండి రథ ప్రాకార ఉత్సవం జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాలను అందించారు.
ఇది కూడా చదవండి.