ETV Bharat / state

సీపీఎస్ రద్దుపై తాడోపేడో తేల్చుకుంటాం.. ఉపాధ్యాయ సంఘాలు - యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా

5k Run for CPS abolition: అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్, నాలుగు సంవత్సరాలైనా హామీని అమలు పరచలేదని యూటీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీఎస్ రద్దు పై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ.. కడపలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు.

CPS
సీపీఎస్
author img

By

Published : Jan 8, 2023, 1:28 PM IST

5k Run for CPS abolition : సీపీఎస్ రద్దు పై కడపలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో 5కే రన్ నిర్వహించారు. ఈ పరుగుకు పోలీసులు అనుమతి ఇవ్వక పోయినప్పటికీ ఉపాధ్యాయులు నిర్వహించారు. సీఎం జగన్​ అధికారంలోకి వచ్చిన వారంలోనే సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చినా.. నాలుగు సంవత్సరాల అయినప్పటికీ హామీని అమలు పరచలేదని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ రాజా మండిపడ్డారు.. రాష్ట్ర అతిథి గృహం నుంచి బయలుదేరిన 5కెే రన్ ఇరిగేషన్ కార్యాలయం వరకు సాగింది. ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.సీపీఎస్ రద్దు కోసం గత నాలుగేళ్ల నుంచి ఉపాధ్యాయులు అనేక రూపాలలో ఆందోళనలు చేసినప్పటికీ ముఖ్యమంత్రి లో ఏమాత్రం చలనం రాలేదని ఆరోపించారు. ఇక వేచి చూసే ఓపిక లేదని తాడోపేడో తేల్చుకుంటామని ఉపాధ్యాయులు సవాల్ విసిరారు. తాడేపల్లి పాలెస్ లో కూర్చొని ముఖ్యమంత్రి ఉపాధ్యాయులు పడుతున్న కష్టాలు కనపడలేదా అని ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి సీపీఎస్ రద్దు చేయాలని లేదంటే ఉద్యమ పోరు తప్పదని హెచ్చరించారు.

కడపలో సీపీఎస్ రద్దు కోసం యూటీఎఫ్ 5కే రన్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.