పచ్చని పంటలను, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తూ కడప జిల్లాలో తుమ్మలపల్లెలో యురేనియం ఉత్పత్తి జరుగుతుందని పర్యావరణవేత్త బాబురావు ఆరోపించారు. పునరుత్పాదక వనరులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో అణు విద్యుత్తు కోసం ఆరాటపడాల్సిన అవసరం లేదన్నారు. యురేనియం తవ్వకాలు, ఉత్పత్తి కర్మాగారం వలన తుమ్మలపల్లె చుట్టుపక్కల గ్రామాల్లో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థ అయిన యురేనియం కర్మాగారం యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. రైతుల తరఫున పోరాడుతున్న పర్యావరణవేత్త, మాజీ శాస్త్రవేత్త బాబూరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి :