రాజంపేటలో అండర్-18 జాతీయ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తెలిపారు. కడప జిల్లా రాజంపేటలో వచ్చే నెల 26 నుంచి జాతీయ వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో నిర్వహించే ఈ పోటీలకు సంబంధించి వసతి, క్రీడా ఏర్పాట్లు ఆర్డీవో ధర్మ చంద్రారెడ్డి, డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఇన్ఫాంట్ జీసస్ పాఠశాలలో వసతి ఏర్పాట్లు పరిశీలించారు. జనవరి 26 నుంచి ఆరు రోజులపాటు నిర్వహించే జాతీయస్థాయి పోటీలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు రానున్నారు. వారు ఉండడానికి వసతి ఏర్పాటుతో పాటు వారి ప్రాంతాలకు చెందిన వంటకాలను అందించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీచూడండి.కడప కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ధర్నా