ETV Bharat / state

కత్తితో యువకుడు హల్​చల్.. తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య - Crime news

Two people committed suicide: ఎన్టీఆర్ జిల్లాలో పట్టపగలే మద్యం మత్తులో కత్తితో యువకుడు హల్​చల్ చేసి ఒక వ్యక్తిపై దాడికి యత్నించాడు. మరోచోట.. తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్న బాలికను తల్లిదండ్రులు మందలించగా మనస్థాపానికి గురైన ఇంటికి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Two people committed suicide
Two people committed suicide
author img

By

Published : Mar 13, 2023, 12:20 PM IST

Two people committed suicide and died: తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్న బాలికను తల్లిదండ్రులు మందలించగా మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరి వేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మీపురానికి చెందిన బత్తల సిరి 9వ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటోంది. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఇంకా ఎంతసేపు ఆడుకుంటావని, ఇంటికి రావాలని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కళ్ల ఎదుట ఆటాడుకుంటూ కనిపించిన బాలిక కొన్ని నిమిషాల వ్యవధిలోనే శవమే కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.

ప్రకాశం జిల్లాలో.. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో ప్రేమ్ కుమార్ (18) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివార్లలోని నిర్మానుష ప్రదేశంలోని ఓ రేకుల షెడ్డులో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు దొనకొండ మండలం పుల్లయ్యా పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రేమ్​కుమార్​ ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

కత్తితో యువకుడి హల్​చల్.. ఎన్టీఆర్ జిల్లా.. తిరువూరు పట్టణంలో పట్టపగలే కత్తితో యువకుడి హల్​చల్.. పట్టణంలోని జైభావి సెంటర్ శ్రీరామాంజనేయ సెల్ సెంటర్ యాజమాని కట్టా ప్రసాద్​పై పాత తిరువూరుకు చెందిన చింతల రాజు అనే యువకుడు మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించాడు.. ఉదయం పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్న ప్రసాద్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్న రాజు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి ప్రసాద్ షాపుకు వచ్చాడు.. కొద్ది సేపటి తర్వాత రాజు.. షాపు వద్దకు కత్తితో వచ్చి ప్రసాద్​పై దాడికి యత్నించాడు.. స్థానికులు అడ్డుకుని ఎదురు తిరిగడంతో అక్కడ నుంచి రాజు వెళ్లిపోయాడు.. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన వీడియో దృశ్యాలు.. అధికార పార్టీ మండల ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడైన రాజు ఇటీవల మరో ఇద్దరిపై ఇదే తరహాలో దాడికి యత్నంచాడని స్థానికులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.