ETV Bharat / state

మాండవి నదిలో మునిగి ఇద్దరు మృతి

author img

By

Published : Dec 10, 2020, 5:43 PM IST

కడప జిల్లా రాయచోటి మండలం గొర్ల ముదివేడులోని మాండవి నదిలో మునిగి ఇద్దరు మరణించారు. చేపలు పట్టేందుకు వెళ్లి అయ్యూబ్ అనే బాలుడు నదిలో మునిగిపోయాడు. ఇది గమనించి రక్షించేందుకు వెళ్లిన వృద్ధుడు నదిలో చిక్కుకుని నీట మునిగాడు.

Two died by sinking   in Mandvi river
Two died by sinking in Mandvi river

కడప జిల్లా రాయచోటి మండలం గొర్ల ముదివేడులో విషాదం జరిగింది. మాండవి నదిలో నదిలో మునిగి ఇద్దరు మృతి చెందారు.ముదివేడు గ్రామానికి చెందిన అయ్యూబ్(13) అనే బాలుడు గ్రామ సమీపంలోని మాండవి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఇసుక ఊబిలోకి దిగడంతో.. దానిలో ఇరుక్కుపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఆర్తనాదాలు పెడుతున్న బాలున్ని చూసి.. నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్న వెంకటరమణ (65) అనే వృద్ధుడు అయ్యూబ్​ను రక్షించేందుకు నదిలోకి దిగాడు. ఆయన కూడా ఊబిలో ఇరుక్కుపోవటంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

నీటిలో ఇరుక్కుపోయిన వీరిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీశారు. వీరి మృతితో గొర్ల ముదివేడులో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం: రివర్స్ టెండరింగ్​లో రూ.60 కోట్లు ఆదా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.