ETV Bharat / state

మోదీ ప్రధాని పదవికి అనర్హుడు: తులసిరెడ్డి - తులసిరెడ్డి

ప్రధానమంత్రి పదవికి నరేంద్రమోదీ అనర్హుడని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. ప్రధాని హోదాలో బహిరంగంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

మోదీ ప్రధానమంత్రి పదవికి అనర్హుడు: తులసిరెడ్డి
author img

By

Published : Apr 30, 2019, 1:13 PM IST

మోదీ ప్రధానమంత్రి పదవికి అనర్హుడు: తులసిరెడ్డి

నరేంద్రమోదీ స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దారుణమని కాంగ్రెస్ సీనియర్​ నేత తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన... ప్రధానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తృణముల్ కాంగ్రెస్​ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని... లోక్​సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన మరుక్షణమే వారు తమవైపు వస్తారని వ్యాఖ్యానించడం రాజకీయ దిగజారుడుతనమన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి...

కడపలో బెట్టింగ్ రాయుళ్లు మకాం... భారీగా పందేలు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.