ముఖ్యమంత్రి జగన్ రైతులకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా... గిట్టుబాటు ధర లేక రైతులు పంటలు అమ్ముకోకుండా ఇళ్లలో నిల్వ చేస్తున్నారని పేర్కొన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే... క్వింటాకు రూ.6500 చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పిన విషయం గుర్తుచేశారు.
ఇదీ చదవండీ... సెర్బియా పోలీసుల అదుపులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ?