వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయం చారిత్రక తప్పిదమని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అభిప్రాయ పడ్డారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన సమయంలో... దానిని మృతభాషగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన కడపలో విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లప్రదేశ్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని తెలుగు సాహితీ వేత్తలు, భాషాభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: