ETV Bharat / state

TULASI REDDY: రాజధాని తరలింపు చారిత్రాత్మక తప్పిదం.. సరిదిద్దుకోండి

కాంగ్రెస్‌ పార్టీ విధానం 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. అమరావతి రైతులు శాంతియుతంగా పోరాడుతున్న తీరును కొనియాడారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం చేసిన తప్పును ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని సూచించారు.

TULASI REDDY
TULASI REDDY
author img

By

Published : Aug 9, 2021, 3:14 AM IST

'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అన్నది కాంగ్రెస్‌ పార్టీ విధానమని.. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. రాజధానిని వైజాగ్​కు తరలించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఓ పిచ్చి తుగ్లక్ చర్యతో పాటు.. ఒక చారిత్రాత్మక తప్పిదమని పేర్కొన్నారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న తులసిరెడ్డి.. అన్నదాతలపై ఇంకెన్నాళ్లు నిర్బంధకాండ కొనసాగిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకొని అమరావతినే రాజధానిగా ప్రకటించాలని సీఎం జగన్‌కు.. తులసిరెడ్డి సూచించారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు 600 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా.. ప్రభుత్వానికి ఏమీ పట్టనట్లు ఉండటం దారుణమన్నారు. అహింసా పద్ధతిలో గాంధేయ మార్గాన్ని అనుసరిస్తూ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమం చరిత్రలో అపూర్వ ఘట్టమని అభిప్రాయపడ్డారు. అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' వరకు తలపెట్టిన సైకిల్ యాత్రకు ప్రభుత్వం అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయటమేనన్నారు.

ఇదీ చదవండి:

VIVEKA MURDER CASE: వివేకా హత్యకు వాడిన ఆయుధాల కోసం అన్వేషణ.. దక్కని ఫలితం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.