ETV Bharat / state

'ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డికి టిప్పు సుల్తాన్ గురించి తెలుసా?' - kadapa district latest news

రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తామనటాన్ని తెలంగాణ రాష్ట్ర భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ తప్పుపట్టారు. వైకాపా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డికి అసలు టిప్పుసుల్తాన్ గురించి ఏం తెలుసు అని ప్రశ్నించారు. ఓ సామాజికవర్గ ఓట్లు పొందేందుకు వైకాపా చేస్తున్న రాజకీయ ఎత్తుగడ ఇదని విమర్శించారు.

mla raja singh
ఎమ్మెల్యే రాజాసింగ్
author img

By

Published : Aug 5, 2021, 9:02 PM IST

'ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డికి టిప్పు సుల్తాన్ గురించి తెలుసా?'

ఆంధ్రప్రదేశ్​లో టిప్పు సుల్తాన్​ విగ్రహం పెడతామని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి అనటాన్ని తెలంగాణ రాష్ట్రంలోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తప్పుపట్టారు. అసలు శివప్రసాద్ రెడ్డికి టిప్పుసుల్తాన్​ గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. దేశం, రాష్ట్రం, ధర్మం కోసం పోరాటాలు చేసిన వాళ్ల విగ్రహాలు పెట్టకుండా... టిప్పుసుల్తాన్ విగ్రహమే ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిందువులను అతి కిరాతకంగా చంపిన టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

YCP Vs BJP: కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధం: రాచమల్లు శివప్రసాద్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.