కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా తరఫున ట్రాన్స్ జెండర్స్ ప్రచారంలోకి దిగారు. తెదేపా ప్రభుత్వం తమను థర్డ్ జెండర్స్గా గుర్తిస్తూ.. ఆధార్ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు, పింఛన్లు అందజేసిందని ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. పార్టీ నేతలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమనీ.. సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ వీఎస్ ముక్తియార్ వారితో ప్రచారం చేశారు.
ఇవీ చదవండి..