కడప జిల్లాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయరాదని సూచించారు. ప్రతి ఒక్క వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, బీమా, కాలుష్య నియంత్రణ పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు.
రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలకు ఎక్కువ శబ్దం వచ్చే పొగ గొట్టాలను ఏర్పాటు చేయరాదని, ఒకవేళ అలాంటి గొట్టాలు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని... లేదంటే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. రాత్రివేళలో అనుమతి కలిగి ఉన్న ఆటోలను మాత్రమే నడపాలని సూచించారు. ప్రతి ఒక్క వాహనదారుడు శిరస్త్రాణం ధరించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: