కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లె అటవీ ప్రాంతంలో... అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముగ్గురు దుండగులు అరెస్ట్ అయ్యారు. ఐషర్ వాహనంతోపాటు 14 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడువాసులని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాపై సమాచారం అందటంతో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దుంగల విలువ రెండు లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండీ...గుంటూరు జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు...నలుగురు మృతి