కడప జిల్లాలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. కడపకు చెందిన వెంకటసుబ్బారెడ్డి ద్విచక్ర వాహనంపై ఒంటిమిట్ట ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా రామాంజనేయపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
కృష్ణా కూడలి వద్ద 17వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో... గాయపడిన మహమ్మద్ హుస్సేన్ చికిత్స పొందుతూ నేడు మృతి చెందాడు. పాత బస్టాండ్లోని ఓ లాడ్జిలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు విషయం తెలుసుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: స్నేహితుల మధ్య ఘర్షణ... యువకుడు మృతి