కడప జిల్లా ప్రొద్దుటూరులో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. కరోనాపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ, సీఐలకు సూచించారు. పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తులు ఎక్కడెక్కడ తిరిగారో వారిని.. వారి బంధువులు, స్నేహితులను గుర్తించాలని కోరారు. అందరినీ క్వారంటైన్‌కి తరలించాలన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఇంటి నుంచి మూడు కిలోమీటర్లు రెడ్‌జోన్‌గా ప్రకటించాలన్నారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రోడ్లపై పురపాలిక కార్మికులతో క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించాలని సూచించారు.
ఇదీ చదవండి: