కడప ఆర్టీసీ బస్టాండు నుంచి 7 డిపోల పరిధిలో బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కంటైన్మైంట్ జోన్లో ఉన్న ప్రొద్దుటూరు డిపో నుంచి మాత్రం బస్సులు తిప్పడం లేదని పేర్కొన్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా బస్సుల్లో కండక్టర్లు లేకుండానే గ్రౌండ్ బుకింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కడప నుంచి ఇతర జిల్లాలైనా అనంతపురం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామన్న ఆయన ప్రయాణికుల అవసరం దృష్ట్యా గురువారం సాయంత్రం నుంచి విజయవాడకు కూడా సర్వీసు నడుపుతున్నామని వెల్లడించారు.
'కడప జిల్లా వ్యాప్తంగా 140 బస్సులు నడుస్తున్నాయ్' - కడప జిల్లాలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం
లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో కడప జిల్లా వ్యాప్తంగా 140 బస్సులను నడుపుతున్నట్లు కడప ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో బస్సులో ప్రయాణించే వారి వివరాలను కచ్చితంగా నమోదు చేసుకుంటున్నామని చెబుతున్న ఆర్ఎం జితేంద్రనాథ్రెడ్డితో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి.
కడప ఆర్టీసీ బస్టాండు నుంచి 7 డిపోల పరిధిలో బస్సులు నడుస్తున్నాయని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్రెడ్డి తెలిపారు. కంటైన్మైంట్ జోన్లో ఉన్న ప్రొద్దుటూరు డిపో నుంచి మాత్రం బస్సులు తిప్పడం లేదని పేర్కొన్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేయడమే కాకుండా బస్సుల్లో కండక్టర్లు లేకుండానే గ్రౌండ్ బుకింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. కడప నుంచి ఇతర జిల్లాలైనా అనంతపురం, కర్నూలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామన్న ఆయన ప్రయాణికుల అవసరం దృష్ట్యా గురువారం సాయంత్రం నుంచి విజయవాడకు కూడా సర్వీసు నడుపుతున్నామని వెల్లడించారు.
ఇవీ చదవండి
రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం