కడప జిల్లా వేంపల్లెలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 35 గ్రాముల బంగారం, 45 వేల నగదు చోరీ జరిగిందని బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యజమాని షేక్ మహమ్మద్ రఫీ ఊరు నుంచి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని దుస్తులు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
యూజీడీ పనుల పూర్తికి ముగిసిన గడువు... సాగతీతతో నగర వాసులకు అవస్థలు