కడప జిల్లా బద్వేలు మైదుకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. దొడ్ల డైరీ వద్ద 67వ జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న మూడు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతుడు బి. కోడూరు మండలం బోడపాడుకు చెందిన పద్మనాభరెడ్డిగా పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి: