కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని రాజనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు, మినీ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రక్కు ఎగిరి... వెనుక భాగం గాల్లోనే ఉండి పోయింది. మరో వైపు ట్రక్కు ముందు భాగంలో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు పోయాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వటంతో... వారు ఎంతో చాకచక్యంతో అతన్ని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న నలుగురితోపాటు... ట్రక్కు లో ఉన్న ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండీ...లారీని , బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి