కడప జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధుడు క్షయ వ్యాధిగ్రస్తుడని... కరోనాతో చనిపోలేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముద్దనూరుకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు క్షయ వ్యాధితో బాధపడుతూ... కొవిడ్-19 ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. కరోనా నమూనా పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చిందని... ఆ వృద్ధుడిది కరోనా మరణం కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో 1136 మంది వద్ద కరోనా నమూనాలు సేకరించగా 29 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఇంకా 384 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 5 వేల మందిలో ఇంకా 925 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొన్నారు.
'ఆ వృద్ధుడు కరోనాతో చనిపోలేదు'
కడప జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధుడు కరోనాతో చనిపోలేదని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. క్షయ వ్యాధితో బాధపడుతూ... కొవిడ్-19 ఆసుపత్రిలో వృద్ధుడు చేరినట్లు అధికారులు తెలిపారు.
కడప జిల్లా కొవిడ్ ఆసుపత్రిలో మృతి చెందిన వృద్ధుడు క్షయ వ్యాధిగ్రస్తుడని... కరోనాతో చనిపోలేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముద్దనూరుకు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు క్షయ వ్యాధితో బాధపడుతూ... కొవిడ్-19 ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. కరోనా నమూనా పరీక్షల్లో అతనికి నెగెటివ్ వచ్చిందని... ఆ వృద్ధుడిది కరోనా మరణం కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ జిల్లాలో 1136 మంది వద్ద కరోనా నమూనాలు సేకరించగా 29 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఇంకా 384 మంది నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 5 వేల మందిలో ఇంకా 925 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ప్రాణదాతలు: ఆపదలో ఆదుకున్న 'రక్షకులు'