కడప జిల్లాలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్‌కు త్వరలోనే పర్యావరణ అనుమతులు రానున్నాయని ఆ సంస్థ ఎండీ షగిలి షన్మోహన్ స్పష్టం చేశారు. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు ఇటీవలే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయ్యిందని వెల్లడించారు. పర్యావరణ ప్రభావ తుది నివేదికను కూడా 2020 డిసెంబరు నెలలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిందని వివరించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని సున్నపు రాళ్లపల్లిలో ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ద్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నట్టు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: