కడప జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సచివాలయాల ఉద్యోగాల పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 266 కేంద్రాల్లో లక్షన్నర మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని ఆయన తెలిపారు. పరీక్షల సందర్భంగా చిన్న తప్పు జరిగినా పెద్ద సమస్యగా మారుతుందనే విషయం అధికారులంతా గుర్తుంచుకోవాలని ..పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ అంతా ఈనెల 30వ తేదీన అధికారులకు అందజేస్తామన్నారు. వీటితోపాటు గ్రామ సచివాలయాల ఉద్యోగాల అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. గ్రామ సచివాలయాల పరీక్షలు రాసే అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబరు-1077, ఫోన్ నంబర్-08562-246344 కు ఫోన్ చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ నంబర్లు ఈనెల 27వ తేదీ నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇదీచూడండి.విశాఖ వేదికగా మిస్టర్ అండ్ మిస్సెస్ ఇండియా ఆడిషన్స్