తెలంగాణకు చెందిన వ్యక్తి.. రైలు ప్రయాణంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ పరిధిలో చనిపోయారు. వనపర్తి జిల్లా చిత్యాలకు చెందిన పుట్టాలయ్య.. స్నేహితులతో కలిసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తుండగా.. కడప జిల్లా పరిధిలో ఈ ఘటన జరిగింది. శౌచాలయానికి వెళ్లిన పుట్టాలయ్య.. రెండు గంటలైనా బయటికి రాకపోవడంపై.. అనుమానం వచ్చిన మిత్రులు అతడి కోసం రైలంతా వెతికారు. చివరికి.. శౌచాలయంలోనే కుప్పకూలి ఉండడాన్ని గుర్తించారు. కడప జిల్లా నందలూరులో మృతదేహాన్ని బయటికి తీశారు. గుండెపోటు కారణంగానే అతడు చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి