తమిళనాడులో ఎమ్మెల్యే కారులో దొరికిన రూ. 5.27 కోట్లు వైఎస్ భారతి బంధువుకు ఇచ్చేందుకు తీసుకెళుతూ పట్టుబడ్డారని కడప తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ఆరోపించారు. వెంటనే మంత్రి బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కారుకు ఎమ్మెల్యే స్టికర్ అతికించి డబ్బులను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.
తమిళనాడులో పోలీసులకు దొరికిన రూ.ఐదు కోట్లపై సీబీఐ విచారణ చేపట్టాలని తెదేపా నేత కిమిడి నాగార్జున అన్నారు. మంత్రి ఆ డబ్బులు తనవి కాదని బంగారం వ్యాపారిపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో బంగారం షాపులు తిరిగి తెరవడం లేదని.. అలాంటి సమయంలో ఆ వ్యాపారికి ఐదు కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానం వ్యక్తం అవుతుందన్నారు.
ఇదీ చదవండి: అయోధ్య రామాలయంపై రేపు కీలక నిర్ణయం!