ETV Bharat / state

'అక్రమాలను ప్రశ్నించినందుకు వేధిస్తూ.. తప్పుడు కేసులు పెడుతున్నారు'

వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలు, భూకబ్జాలకు అడ్డు వస్తున్నారనే కారణంతోనే తెదేపా నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెదేపా నేత లింగారెడ్డి తెలిపారు.

మాట్లాడుతున్న తెదేపా నేతలు
మాట్లాడుతున్న తెదేపా నేతలు
author img

By

Published : Sep 14, 2021, 3:45 PM IST

కడప జిల్లాలో వైకాపా నాయకులు చేస్తున్న అక్రమాలు, భూకబ్జాలకు అడ్డు వస్తున్నారనే కారణంతో తెదేపా నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెదేపా కడప పార్లమెంటరీ అధ్యక్షుడు లింగారెడ్డి మండిపడ్డారు. అంతేగాక తీవ్రంగా చితకబాదుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కడప 50వ డివిజన్ తెదేపా ఇన్​ఛార్జి వెంకటసుబ్బారెడ్డిని పోలీసులు ఈనెల 8న డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి రెండు మూడు కేసుల్లో నిందితుడిగా ఒప్పుకోవాలని చితక బాదినట్లు లింగారెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. బాధితుడికి తగిలిన దెబ్బలను చూపించారు. ఈ ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

వైకాపా నాయకులు శ్రీనివాసులురెడ్డి చేస్తున్న భూకబ్జాలకు తెదేపా నాయకుడు అడ్డు తగులుతున్నాడనే కారణంతో పోలీసులతో కొట్టించారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుబ్బారెడ్డి.. స్టేషన్​లో పోలీసులు లాఠీలతో చితక బాదారని పేర్కొన్నాడు. వివిధ కేసుల్లో నేరం అంగీకరించకపోతే.. రాత్రికి రాత్రే ఎన్​కౌంటర్ కూడా చేస్తామని హెచ్చరించినట్లు బాధితుడు వాపోయాడు. తెదేపా జిల్లా నాయకుల చొరవతో తాను స్టేషన్ నుంచి బయటపడి రిమ్స్.. హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చానని వెల్లడించారు. జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'ముగ్గురు సంతానం ఉన్నవారికీ అవకాశం కల్పించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.