రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి తెచ్చే రాజధాని అవసరమని విభజన అనంతరం అమరావతినే రాజధానిగా చేశారని తెదేపా నేత ఆర్.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటిలో పలువురు మైనార్టీ మహిళలు తేదేపాలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని మార్చాలని నిర్ణయించడం తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు. విశాఖపట్నంలో వైకాపా నాయకులు స్థలాలు కొనుగోలు చేసి వాటి ద్వారా లబ్ధి పొందడానికి రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
అంతకుముందు రాయచోటి పట్టణానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఆమెకు జరిగిన అన్యాయాన్ని, వైకాపా నాయకులు తనపై పెట్టిన కేసును శ్రీనివాస్‌రెడ్డికి వివరించారు. రాయచోటిలో వైకాపా నేతల ఆగడాలు ఎక్కువ అవుతున్నాయని ఆరోపించారు.
ఇదీ చదవండి: దర్శకుడు రాజమౌళిపై 'ఆర్ఆర్ఆర్' టీమ్ ఫిర్యాదులు!