కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి వేలమంది ప్రజలతో బహిరంగ సభ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఉపాధ్యక్షులు నక్కల శివరాం ఒకటో పట్టణ సీఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈనెల 9వ తేదీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప మహావీర్ కూడలి వద్ద పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు వచ్చిన వారిలో దాదాపు సగం మందికి మాస్కులు లేవని.. కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కనీసం నిబంధనలు పాటించకుండా, 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ బహిరంగ సభను ఏర్పాటు చేశారని చెప్పారు. విపత్తు నిర్వహణ చట్టం 2005 మేరకు సెక్షన్ 55, 56 ప్రకారం ముఖ్యమంత్రితో పాటు సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లాకలెక్టర్, ఎస్పీ అందరి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:Kadapa: ప్రొద్దుటూరు పురపాలిక కమిషనరు రాధ బదిలీ ఉత్తర్వుల నిలిపివేత