కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పరిశ్రమలో చొరబడి సౌర పలకలను ధ్వంసం చేయడం చాలా దారుణమని తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గానికి ఫ్యాక్షన్ ముద్ర ఉందన్నారు. ఈ కారణం చేత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చాలా మంది సుముఖత చూపడం లేదని తెలిపారు. సుమారు ఆరు వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర పరిశ్రమపై దాడి చేసి రెండు వేల పలకలను నాశనం చేయడం అనాగరికమని చెప్పారు. ఈ విధ్వంసంలో సుమారుగా మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి... విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
"సోలార్ పరికరాల ధ్వంసం దారుణం" - tdp
సోలార్ పరిశ్రమలో చొరబడి పరికరాలు ధ్వంసం చేయడాన్ని తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఖండించారు. విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా మైలవరం మండలంలో సోలార్ పరిశ్రమలో చొరబడి సౌర పలకలను ధ్వంసం చేయడం చాలా దారుణమని తెదేపా సీనియర్ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ఇప్పటికే జమ్మలమడుగు నియోజకవర్గానికి ఫ్యాక్షన్ ముద్ర ఉందన్నారు. ఈ కారణం చేత పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు చాలా మంది సుముఖత చూపడం లేదని తెలిపారు. సుమారు ఆరు వేల ఎకరాల్లో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సౌర పరిశ్రమపై దాడి చేసి రెండు వేల పలకలను నాశనం చేయడం అనాగరికమని చెప్పారు. ఈ విధ్వంసంలో సుమారుగా మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగి ఉంటుందని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి... విధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కంట్రీబ్యూటర్:- కొండలరావు దర్శి 9848450509
గాలిమిషన్ పేలడంతో ఒ వ్యక్తి కాలుతెగిపడిన ఘటన మంగళవారం ఉదయం దర్శిపంచాయతిలోని శివరాజ్ నగర్ లో చోటు చేసుకుంది.
ప్రకాశంజిల్లా దర్శిపంచాయతీలోని శివరాజ్ నగర్ లో తిరుపతయ్య 50సం,,లు కు వల్కనైజింగ్ షాపు(పంక్చర్ల దుకాణం) కలదు. రోజుమాదిరిగానే ఉదయాన్నే లేచి గాలిమిషన్ కు గాలి నింపటానికి మోటార్ ఆన్ చేసి తిరుపతయ్య దుకాణాన్ని సర్దుకుంటున్నాడు.ప్రతిరోజూ గాలిమిషన్ లో గాలి నిండగానే దానంతటదే ఆగిపోతుంది.కానీ ఈరోజు మిషన్ ఆగిపోకపోగా గాలి ఎక్కువై ఒక్కసారిగా పేలటం జరిగింది.గాలి ట్యాంక్ పేలడంతో ఓ ముక్క బాగం వచ్చి దుకాణం సర్దు కుంటున్న తిరపతయ్య కాలికి తగిలింది.కాలి ఎముక పూర్తిగాతెగి చర్మం పై వేలాడుతుంది.తిరుపతయ్యనువెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హుటాహుటినా ఒంగోలుకు తరలించారు.
Body:ప్రకాశంజిల్లా దర్శి. Conclusion:కొండలరావు దర్శి 9848450509