Peddakandukur Explosion Today : తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. యాదగిరిగుట్ట మండలంలోని పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌క్లూజివ్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. యాజమాన్యం ఎమర్జెన్సీ సైరన్‌తో కార్మికులను అప్రమత్తం చేసింది.
ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటానా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే బచ్చన్నపేటకు చెందిన ఎం.కనకయ్య మృతి చెందాడు. మరో కార్మికుడు ప్రకాశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కర్నూలు జిల్లాలో బోరుబావిలో పేలుడు - ముగ్గురికి తీవ్రగాయాలు
పేలుడు పదార్థాల ఆర్మీ కంటైనర్‌ను ఢీకొట్టిన లారీ - 100 మీటర్ల దూరం వరకు ఖాళీ చేయించిన అధికారులు