కడప జిల్లా మామిళ్లపల్లిలోని పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని.. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. పేలుడు జరిగిన ముగ్గురాళ్ల గనులను... పార్టీ నేతల బృందం పరిశీలించింది.
స్థానికులను, అక్కడి పనిచేస్తున్నవారిని అడిగి... ప్రమాదానికి కారణాలను తెలుసుకుంది. అక్రమ మైనింగ్ నిరోధంలో... అధికారులు వైఫల్యమయ్యారని నేతలు ఆరోపించారు. మైనింగ్ నిర్వాహకుడు వైకాపా నేత అని... ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: