ETV Bharat / state

నిర్వాసితుల పోరాటానికి తెదేపా, భాజపా నేతల మద్దతు - Thalla Podduturu Victims news

17 రోజులుగా కొనసాగుతున్న తాళ్లపొద్దుటూరు నిర్వాసితుల పోరాటానికి తెదేపా, భాజపా నేతలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. తాళ్ల పొద్దుటూరులో నీటమునిగిన బీసీ, ఎస్సీ కాలనీలను పరిశీలించి బాధితులను పరామర్శించారు.

tdp-bjp-leaders-support-to-thalla-podduturu-victims
నిర్వాసితుల పోరాటానికి తెదేపా, భాజపా నేతల మద్దతు
author img

By

Published : Sep 19, 2020, 11:22 PM IST

కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరులో గండికోట నిర్వాసితులకు తెదేపా, భాజపా నాయకులు మద్దతు తెలిపారు. శనివారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి తదితర నాయకులు గ్రామానికి చేరుకుని నిర్వాసితులకు సంఘీభావం తెలియజేశారు.

17 రోజులుగా కొనసాగుతున్న నిర్వాసితుల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు. తాళ్ల పొద్దుటూరులో నీటమునిగిన బీసీ, ఎస్సీ కాలనీలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. ముంపు బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు వెన్నంటే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... ప్రలోభాలకు లోనై.. పార్టీకి ద్రోహం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.