మాయమాటలతో అమాయక ప్రజలను నమ్మించి.. వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ఏడుగురు సైబర్ ముఠా సభ్యులను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుమిత్ బన్సాలి, శివరాత్రి కార్తీక్, నరాల కార్తీక్ అనే ముగ్గురు వ్యక్తులు దిల్లీ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. మైదుకూరుకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు... దిల్లీలో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై కడపకు తీసుకొచ్చారు. వీరికి సహకరించిన కడప, కర్నూలు జిల్లాలకు చెందిన మరో నలుగురినీ అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల వేసి వారితో ఈ ముఠా సైబర్ నేరాలు చేయిస్తోందని ఎస్పీ తెలిపారు. కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన 15 మంది యువకులను దిల్లీ నుంచి సురక్షితంగా తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి బ్యాంకు ఖాతా నంబర్లు, పిన్ నంబర్లు అడిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దని ప్రజలకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి
ఘనంగా శ్రీ విజయదుర్గ దేవి వార్షికోత్సవం