ETV Bharat / state

జమ్మలమడుగులో వివిధ శాఖల అధికారుల ఆకస్మిక తనిఖీలు - lockdown effect on people

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ కఠినంగా అమలవుతోంది. ఇదే అదనుగా చూసుకొని కడప జిల్లా జమ్మలమడుగులో కొందరు వ్యాపారులు అధిక ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న వివిధ శాఖల అధికారులు ఏకకాలంలో పట్టణంలోని దుకాణాలపై దాడి చేశారు.

Sudden checks of officers of various departments in Jammalamadugu
జమ్మలమడుగులో వివిధ శాఖల అధికారుల ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Apr 16, 2020, 5:11 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో విజిలెన్స్, ఆహార నియంత్రణ, తూనికలు మరియు కొలతల శాఖల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కూరగాయల మార్కెట్​లో ధరల వివరాలు సేకరించిన అనంతరం పట్టణంలోని పలు దుకాణాల్లో సోదాలు చేశారు. ఉత్పత్తుల ప్యాకెట్లపై తయారీకి సంబంధించిన వివరాలు లేకపోవడంతో రెండు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే నిత్యావసర సరకులను విక్రయించాలని... అలా కాకుండా ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదీచదవండి.

ముఖ్యమంత్రి నివాసానికి కరోనా ఎఫెక్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.