కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మేకల బలయపల్లె గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వడ్డెర కులాల ప్రజలు తమ జీవనోపాధికి ఒక ఎకరా భూమి ఇవ్వాలని కలెక్టర్, డీఆర్వో,షెడ్యూల్డ్ కులాల ఈడీలకు వినతిపత్రం ఇచ్చారు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌కు కూతవేటు దూరంలో ఉన్నా... తమకు ఎటువంటి జీవనోపాధి లేదని వాపోయారు. ప్లాంట్ నుంచి వచ్చే వ్యర్థాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులుగానే ఉన్నామని తెలిపారు. గోపులపురం వద్దనున్న దాదాపు 250 ఏకరాల ప్రభుత్వ బంజరభూమిని పేదలమైన తమకు ఇవ్వాలని పములేటి సుధాకర్, గురుస్వామి, మేకలబలయపల్లె గిరిజనులు కోరారు.
ఇదీ చూడండి