మరికొద్ది గంటల్లో కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామస్వామి వారి కల్యాణ మహోత్సవం జరగనుంది. ఆ వేడుకను చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఒంటిమిట్ట చేరుకుంటున్నారు. రద్దీకి అనుగుణంగా కడప జిల్లా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో 110 బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్టాండుల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు కల్యాణ క్రతువు జరగనుంది.
ఇది కూడా చదవండి.