కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలో పని చేస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌కు కరోనా సోకింది. విషయం తెలుసుకున్న ఎస్పీ అన్బురాజన్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆందోళన పడద్దని ధైర్యం చెప్పారు. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలని సూచించారు. ఏ సహాయం కావాలన్నా తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసు శాఖ అండగా ఉంటుందన్నారు.
ఇవీ చూడండి: