తిరుమలకు పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన వారిని.. విధి నిర్వహణలో భాగంగా భుజాన మోసుకుంటూ, ఆస్పత్రిలో చేర్పించిన కానిస్టేబుళ్లను.. కడప ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు. పోలీసు శాఖ తరఫున ప్రశంసాపత్రాన్ని అందచేశారు. తిరుమల మహా పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఓ వృద్ధురాలిని కడప జిల్లా స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టెబుల్ షేక్ అర్షద్ (పీసీ 1269)... దట్టమైన అడవిలో దాదాపు 6 కిలోమీటర్లు భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రిలో చేర్పించారు.
అలాగే.. గత ఏడాది డిసెంబర్లో పాదయాత్రలో అస్వస్థతకు గురైన ఓ యువతిని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ కుళ్లాయప్ప.. తన భుజాన మోస్తూ తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసు శాఖను ప్రజలకు మరింత చేరువ చేశారంటూ.. వీరికి జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఇదీ చదవండి:
శభాష్ పోలీస్: సొమ్మసిల్లిన మహిళను 6 కిలోమీటర్ల మోసుకెళ్లి కాపాడాడు!