మహిళలకు రక్షణ కల్పించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఎప్పుడు ముందంజలో ఉంటుందని కడప ఎస్పీ అన్బురాజన్ అన్నారు. కడప పోలీస్ కార్యాలయంలో 50 దిశ వాహనాలను ఎస్పీ ప్రారంభించారు.. ఈ వాహనాలు జిల్లావ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్లకు కేటాయించినట్లు తెలిపారు. మహిళలు, విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా 100కు ఫోన్ చేసిన క్షణాల్లో.. ఘటనా స్థలంలో పోలీసులు ఉంటారని ఎస్పీ అన్నారు. మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎల్లవేళలా పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక మహిళ తమ ఫోన్లలో దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. దిశ యాప్ ఉంటే రక్షణ వెన్నంటి ఉంటుందని ఎస్పీ అన్బురాజన్ అన్నారు.
ఇదీ చదవండి: అంతరాష్ట్ర దొంగల అరెస్ట్.. రూ.20 లక్షల విలువైన బంగారం స్వాధీనం