ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని ఎస్పీ అమిత్‌బర్దార్ సూచించారు. కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సూర్యమహల్, డేఅండ్ నైట్, ఎస్‌బీఐ, నవభారత్ కూడళ్లలో మాస్క్‌లు ధరించని వారికి వాటిని అందించి అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. దుకాణాల యాజమాన్యాలు నోమాస్క్ నోఎంట్రీ అని సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అనంతరం కొవిడ్ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ బాలరాజు, సీఐలు వెంకటరమణ, అంబేద్కర్, ఆర్‌ఐలు కోటేశ్వరరావు, ప్రదీప్, ఎస్సైలు ఉన్నారు.
ఇదీ చదవండి: సముద్రస్నానానికి వెళ్లి... ముగ్గురు ఉత్తరప్రదేశ్ యువకులు గల్లంతు