ETV Bharat / state

సోలార్‌ ప్లాంట్‌ రైతులకు అందని పరిహారం

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సోలార్‌ ప్లాంట్‌కు భూమిలిచ్చిన రైతులు.. పరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మూడేళ్ల కిందట బాధిత రైతుల భూములు స్వాధీనం చేసుకున్న రెవిన్యూ అధికారులు.. ఇంతవరకూ పరిహారం ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోలార్‌ ప్లాంట్‌ రైతులకు అందని పరిహారం
author img

By

Published : Jul 5, 2019, 3:19 PM IST

సోలార్‌ ప్లాంట్‌ రైతులకు అందని పరిహారం

కడప జిల్లా మైలవరం మండలంలో నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం.. భూములు కోల్పోయిన నిర్వాసితులు పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ఏపీఎస్​పీసీఎల్ సంస్థ 2016లో మైలవరం మండలంలోని వద్దిరాల, దొడియం, పొన్నంపల్లె, రామచంద్రయ్యపల్లె, కోన అనంతపురం గ్రామాల్లోని రైతుల నుంచి.. ఆరు వేల ఎకరాలు సేకరించింది. ఇందులో 5 వేల 7 వందల ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా.. మిగిలిన 300 ఎకరాలు డీకేటీ పట్టా భూములు ఉన్నాయి. ఈ డీకేటీ పట్టా భూములకు ఎకరాకు 6 లక్షల నుంచి ఏడున్నర లక్షలుగా పరిహారాన్ని నిర్ణయించారు. వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పట్టా భూములకు పరిహారం చెల్లించిన అధికారులు, 85 ఎకరాల్లోని డీకేటీ భూములకు పరిహారం ఇంతవరకు చెల్లించలేదు.

ప్రస్తుతం 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సౌరపలకలు అమర్చడం పూర్తైంది. ఉత్పత్తి ప్రారంభమైనా తమకు పరిహారం ఇవ్వలేదంటూ 85 ఎకరాల్లోని డీకేటీ భూముల యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్‌ హరికిరణ్‌ను కలిసిన 43 మంది రైతులు.. తమకు పరిహారం చెల్లించాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

రాజకీయ కారణాలతో బాధితులను నిర్లక్ష్యం చేయవద్దన్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి.. సమస్యను వెంటనే పరిష్కరిచాలని కలెక్టర్‌ను కోరారు. సోలార్ ప్లాంట్ బాధితుల సమస్యలపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్.. రెండ్రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాలకు వెళ్లి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రత్యేక అధికారి బాలగణేశ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Intro:ap_cdp_18_04_somasila_back_water_pkg_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
నీటి ఎద్దడి నివారణకు చేపట్టిన సోమశిల వెనుక జలాల పథకం కలగా మారింది. వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రారంభమైన సోమశిల వెనుక జలాల పథకం ఆయన మరణం తరువాత అర్ధాంతరంగా ఆగిపోయింది. 25 కోట్ల రూపాయలు వెచ్చించి పైపులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ పైపులు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. రాజశేఖరరెడ్డి తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
వాయిస్ ఓవర్:1
కడప నగరంతోపాటు యోగి వేమన విశ్వవిద్యాలయం, ఇడుపులపాయ, ట్రిపుల్ ఐటీ అక్కడ నుంచి లేపాక్షి అనంతపురానికి నీటిని సరఫరా చేసేందుకు సోమశిల వెనుక జలాలను దారి మళ్లించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోమశిల వెనుక జలాల పథకాన్ని ప్రారంభించారు. ఈ మేరకు 25 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్డు వెంబడి పెద్ద పెద్ద పైపులను ఏర్పాటు చేశారు. ఉన్నపలంగా రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఈ పథకాన్ని పట్టించుకునే నాధుడే కరువయ్యారు. నీటి కోసం ఏర్పాటు చేసిన పైపులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని పైపులు పగిలిపోయి ఇనుప చువ్వలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు మినహా కొన్ని వందల పైపులు దెబ్బతిన్నాయి. సోమశిల వెనుక జలాలను ఉపయోగించుకుంటే చాలా ప్రాంతాలకు సాగు, తాగు నీరు కొరత తీరుతుందని వివిధ పార్టీల నాయకులు అంటున్నారు.
byte: రవి శంకర్ రెడ్డి, ఆర్ సి పి ప్రధాన కార్యదర్శి, కడప.
byte: చంద్ర, సిపిఐ నాయకులు, కడప.
వాయిస్ ఓవర్:
దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ప్రారంభించిన పథకాన్ని ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.
PTC: సుందర్ కడప.

Body:సోమశిల వెనుక జలాలు

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.