![అరటి గెలల చాటున ఎర్రచందనం దుంగలు అక్రమ రవాణా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8329942_277_8329942_1596795116880.png)
కడప జిల్లా మంగంపేట అగ్రహారం వద్ద ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీశాఖాధికారులు అడ్డుకున్నారు. బొలెరో వాహనంలో అరటి గెలలు చాటున అక్రమంగా తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను, ఆ వాహనాన్ని, రైల్వేకోడూరుకు చెందిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. 18 ఎర్రచందనం దుంగల విలువ దాదాపు లక్ష రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ఎఫ్ ఆర్ ఓ నయీమ్ అలీ తెలిపారు.
ఇవీ చదవండి