కడప జిల్లా ఓబులవారిపల్లె మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై కోడూరు ఎస్ఈబీ పోలీసులు దాడులు చేశారు. గాదెల అరుంధతీవాడకు సమీపంలోని గచ్చు బావి వద్ద 36 బిందెలలో నిల్వ ఉన్న సుమారు 540 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. బెల్లం ఊట సొంతదారుల ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోందని ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రామ్మెహన్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు చేపట్టినట్లు తెలిపిన ఆయన.. ఎవరైనా అక్రమంగా మద్యం తయారీ, విక్రయం చేసినట్లు తెలిస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని స్థానికులు సూచించారు.
ఇదీ చదవండి:
4 జిల్లా ఆస్పత్రుల్లో.. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలు ప్రారంభించిన సీఎం