తమ కార్మికులు కరోనా బారిన పడకుండా కడప డిపో మేనేజర్ చర్యలు తీసుకున్నారు. డిపోలో పనిచేసేందుకు కార్మికులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు శానిటైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గ్యారేజ్ కార్మికులతో పాటు బస్సు కండక్టర్లు, డ్రైవర్లు అక్కడే ఉంటారు. ఒక ట్యాంకులో నీరు, ఆ పక్కనే శానిటైజేషన్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఇక్కడకు వచ్చిపోయే కార్మికులకు చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి చేయడంపై అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: