ETV Bharat / state

రాయచోటిలో పారిశుద్ధ్య లోపం.. స్థానికుల ఆందోళన

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రత అవసరం. రోజూ వేలల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతోన్న తరుణంలో గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్న ఆలోచన అధికారుల్లో సన్నగిల్లుతుంది. కడప జిల్లా రాయచోటిలో పారిశుద్ధ్య లోపం వల్ల నగరవాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

sanitation problem at rayachot
రాయచోటిలో లోపించిన పారిశుద్ధ్యం
author img

By

Published : Jun 28, 2020, 8:51 PM IST

కడప జిల్లా రాయచోటి పురపాలికలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయినప్పటికీ ఇక్కడ పారిశుద్ధ్య పనులు చేపట్టడంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. 1.20 లక్షల జనాభా ఉన్న పురపాలికలో తరచూ శుభ్రపరచాలి. కానీ రాయచోటిలోని కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులైనప్పటికీ చెత్తకుండీలను శుభ్రం చేయడం లేదు.

వీధుల్లో చెత్త కింద పడటంతో పందులు సంచరిస్తూ దుర్వాసన వెదజల్లుతున్నాయి. ఫలితంగా వ్యాధులు ప్రబలుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఎస్​ఎన్ కాలనీలో వారం రోజులుగా చెత్త కుండీలను శుభ్రం చేయకపోవటంతో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెలువడుతోందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పట్టణం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కడపలో కరోనా కలవరం... భారీగా పాజిటివ్ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.