కడపలో ఇసుక మాఫియా మరోసారి చెలరేగింది. అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ ఆపేందుకు వెళ్లిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగులను ఇసుక ట్రాక్టర్‌తో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. కడప జిల్లా సిద్ధవటం మండల ఎస్ .రాజంపేట నుంచి అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్నట్లు సమాచారం అందటంతో మండల వీఆర్ఏ వెంకటపతి, వీఆర్ఓ ఆరిఫ్ ద్విచక్రవాహనంపై ఇసుక ట్రాక్టర్ ను అపేందుకు వెళ్లారు. ట్రాక్టర్ ముందువైపు వచ్చిన ద్విచక్రవాహనాన్ని ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెవెన్యూ ఉద్యోగులకు గాయాలయ్యాయి. ఇసుక ట్రాక్టర్ డ్రైవ్ర్ అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదంలో గాయపడిన రెవెన్యూ ఉద్యోగులను చికిత్స నిమితం రిమ్స్ కు తరలిచారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అధికారులనే ట్రాక్టర్‌తో ఢీకొట్టిన మాఫియా - sand mafiya attack on two revenue empolyess
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను అపేందుకు వెళ్లిన వీఆర్ఓ, వీఆర్ఏ ప్రమాదం నుంచి బయటపడ్డారు. తప్పించుకునేందుకు అధికారులనే ట్రాక్టర్ తో ఢీకొట్టే యత్నం చేశారు ఇసుక మాఫియా కేటుగాళ్లు.
![అధికారులనే ట్రాక్టర్‌తో ఢీకొట్టిన మాఫియా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3511168-564-3511168-1560055423491.jpg?imwidth=3840)