ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కడప జిల్లా సగిలేరు జలాశయంలోకి భారీ స్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. సగిలేరు జలాశయం గరిష్ట నీటిమట్టం 515 అడుగులు. ఈరోజు రాత్రి పదకొండున్నర గంటలకు సగిలేరు జలాశయం నిండి ఉన్నందున మూడవ గేటును అడుగు మేర ఎత్తి నీటిని బయటకు వదులుతున్నారు. బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లోని లోతట్టు గ్రామాలు, మున్నెల్లి, బోడుగుంటుపల్లి, కొండమోటుపల్లి, పంగావాండ్లపల్లి, గొడుగునూరు, పుట్టాయిపల్లి గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అక్కడే ఉండి సమీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి :