కడప జిల్లాలో పోలీసులు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు పురస్కరించుకుని ఎస్పీ అన్బు రాజన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. వారి సేవలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. దేశ సరిహద్దుల్లో జవాన్లు, అంతర్గతంగా పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: